ఖాదీ అంటే కలెక్షన్లు కాదు.. సేవ
- ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి
విశ్వంభర, కామారెడ్డి: ఖాదీ అంటే కలెక్షన్లు కాదు, సర్వీస్ దిశగా నేను పని చేస్తున్న అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు.
కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. "నేను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ ఇంచార్జీ మంత్రిని తీసుకువచ్చి షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గత రెండు ఏళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో నేను ఏమి మాట్లాడకుండా ఉంటే.. ఈ నియోజకవర్గానికి నవాబులాగా షబ్బీర్ అలీ చెలాయిస్తున్నారు. ఎదుటి వాళ్ళు బూతులు మాట్లాడే స్థాయికి నీ ప్రవర్తన మారింది.
ప్రభుత్వ కళాశాలకు చెందిన భూములను లీజు కు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలకు ఆ స్థలాల కిరాయిలు వస్తున్నాయి. కళాశాల భూములకు సంబంధించి ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన విమర్శలకు అతన్ని ప్రభుత్వ కళాశాల వద్దకు చర్చకు రమ్మంటే కాంగ్రెస్ నాయకులు వందల సంఖ్యలో వచ్చి నా క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. నేను చేసిన సవాల్ కు ఉదయం ప్రభుత్వ కళాశాల వద్దకు వద్దామంటే కామారెడ్డి శాంతి భద్రతల దృష్ట నన్ను బయటకి రావద్దంటే వారికి సహకరించి నేను బయటకు రాలేదు. ప్రభుత్వ కళాశాల ఆస్తుల విషయంలో నేను ఏమైనా అవినీతి చేసినట్టు ఫ్రూప్స్ తో నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డి ప్రభుత్వ కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలని నేను అప్పటి ముఖ్యమంతి రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడినా. అప్పుడు ఈ షబ్బీర్ అలీ మంత్రి హోదాలో ఉండి కూడా కామారెడ్డికి ఏమి చేయని వ్యక్తి. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.'' అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు.



