హరీశ్ రావు అబద్ధాలతో సీఎం రేవంత్, ఉత్తమ్ ను బద్నామ్ చేస్తున్నారు: జగ్గారెడ్డి

కాళేశ్వరం అంశంపై అసెంబ్లీ లో చర్చకు సీఎం రేవంత్ సిద్ధం..దమ్ముంటే మీ మామను అసెంబ్లీ కి తీసుకుని రా..

  • కాళేశ్వరం కట్టించింది మీరే, కూలిపోయింది కూడా మీ హయాంలోనే
  • కానీ నిందలు మాత్రం కాంగ్రెస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నావు
  • ⁠కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల కారణంగానే ఆనాడు కేసిఆర్ నిన్ను ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారు
  • బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని  కేంద్ర సంస్థ NDSA చెప్పింది
  • మంత్రి పదవి కావాలంటే కాంగ్రెస్‌లో చేరవచ్చని  హరీశ్ రావు కు జగ్గారెడ్డి కౌంటర్ 

విశ్వంభర,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రాజెక్టు దెబ్బతినడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదని అన్నారు.కట్టించింది మీరే, కూలిపోయింది మీ హయాంలోనే. దీనికి బాధ్యత మీదే" అని వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం అంశంపై చర్చించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని జగ్గారెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు.హరీష్ రావు ప్రతిరోజూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, అయితే తాను సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలపై బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని పేర్కొన్నారు.హరీష్ రావును సాగునీటి శాఖ మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల కారణంగానే ఆయనను మార్చారని ఆరోపించారు.
డ్యామ్ భద్రత విషయంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నీటి నిల్వలపై కేంద్ర సంస్థ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల ప్రజల భద్రత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.WhatsApp Image 2026-07-09 at 10.45.32 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వల నిర్వహణలో జరిగిన తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని జగ్గారెడ్డి అన్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం, సంబంధిత శాఖే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే అసెంబ్లీ చర్చకు కేసీఆర్, హరీష్ రావు హాజరై ప్రజల ముందే వాస్తవాలను వెల్లడించాలని సవాల్ విసిరారు.
హరీష్ రావు తన రాజకీయ స్థాయి గురించి మాట్లాడే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో సాధించిన ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ రాజకీయ జీవితంలో స్వయంకృషితో ఎదిగారని, బంధుత్వాల ఆధారంగా పదవులు పొందలేదని వ్యాఖ్యానించారు.
చివరగా, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణమైన వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-defaming-cm-revanth-uttam-with-harish-raos-lies/article-18294