విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: విద్యార్థుల శాంతియుత నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు అన్నారు. నీట్, సీయూఈటీ తదితర పరీక్షల నిర్వహణలో తలెత్తిన అవకతవకలు, ఎన్‌టీఏ వైఫల్యాలకు నిరసనగా సోమవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి లో ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమైంది. దీక్షను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, ఎన్‌టీఏపై విద్యార్థుల విశ్వాసం దెబ్బతిందని, దానిని రద్దు చేసి పారదర్శక ప్రవేశ పరీక్షల విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమాలపై పోలీసు నిర్బంధం, ఢిల్లీలో నిరసన కారులపై లాఠీచార్జి, వాటర్ క్యానన్ల ప్రయోగాన్ని ఖండించారు. అరెస్టు చేసిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను వెంటనే విడుదల చేసి, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. రజనీకాంత్, ప్రసాద్, స్కైలాబ్ బాబు, కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, జూనుగరి రమేష్, ఎం. మమత, డి. కిరణ్, కె. అశోక్ రెడ్డి, విఘ్నేష్, ప్రశాంత్, అభిషేక్, నాగకృష్ణ, రవీందర్, సందీప్, ప్రవీణ్, అర్జున్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.