కేటీఆర్‌ను కలిసిన హనుమకొండ, వరంగల్ మైనార్టీ నాయకులు
విశ్వంభర, హనుమకొండ: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను హనుమకొండ, వరంగల్ జిల్లాల మైనార్టీ నాయకులు సోమవారం కలిశారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి వారు హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కేటాయించిన స్థలాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకుందని నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి తమకు అండగా నిలవాలని కోరారు.