ప్రజాపథంలో బస్తీ సమస్యలపై టీడీపీ ఆందోళన

ప్రజాపథంలో బస్తీ సమస్యలపై టీడీపీ ఆందోళన

విశ్వంభర, ఖైరతాబాదు  : ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదు ఖైరతాబాదు నియోజకవర్గంలోని దేవరకొండ బస్తీలో నిర్వహించిన 'తెలుగుదేశం–ప్రజాపథం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బస్తీలో పాదయాత్ర నిర్వహించిన నాయకులు స్థానికుల నుంచి తాగునీటి కొరత, డ్రైనేజీ, దెబ్బతిన్న రహదారుల సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ, బస్తీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లెల కిశోర్, ప్రవీణ్, బాలరాజ్ గౌడ్, వల్లారపు శ్రీనివాస్, అన్వర్, పి. వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tdps-concern-over-basti-issues-in-prajapatha/article-19119

Tags: