ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు వినతిపత్రం
విశ్వంభర, నాంపల్లి : సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా ఫుల్ స్టాక్ అకాడమీ బీబీఏ కోర్సును నిర్వహిస్తున్నట్లు బయటపడింది. ఈ అక్రమ చర్యలో అక్షదీప్ డిగ్రీ కాలేజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ, ప్రైవేట్ అకాడమీకి సహకరించి ప్రజలను విద్య పేరుతో దోచుకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయమై ఏ ఐ ఎస్ ఓ కన్వీనర్ జి. రమేశ్ కుమార్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టా రెడ్డికి వినతిపత్రం సమర్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అకాడమీ, అక్షదీప్ డిగ్రీ కాలేజ్ పేరును ఫార్వార్డింగ్ ఆప్షన్‌గా ఉపయోగిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ అంశాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి,ఉస్మానియా విశ్వవిద్యాలయ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం