మాలపల్లిలో వాతావరణ అనుకూల వ్యవసాయంపై రైతులకు అవగాహన
విశ్వంభర, హుస్నాబాద్ :వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు స్థిరమైన, పర్యావరణహిత సాగు పద్ధతులను అవలంబించాలని వరాహ క్లైమేట్ ఎగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు సూచించారు. హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వాతావరణ అనుకూల వ్యవసాయం, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత, కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వెన్న రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని, రైతులు ఆధునిక, పర్యావరణహిత సాగు విధానాలను అవలంబించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించి సాగు ఖర్చులను నియంత్రించవచ్చని అన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికత, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన పెంచి ఆదాయ వృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. వరాహ క్లైమేట్ ఎగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ పంట అవశేషాల నిర్వహణ, సేంద్రియ పదార్థాల వినియోగం, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం వంటి పర్యావరణహిత పద్ధతులను పాటించడం ద్వారా నేల సారం మెరుగుపడి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని వివరించారు. అలాగే కార్బన్ క్రెడిట్‌కు సంబంధించిన ప్రాథమిక అవగాహన, అర్హత ప్రమాణాలు, నమోదు విధానం, భవిష్యత్తులో లభించే అవకాశాలపై రైతులకు వివరించారు. ఏ ప్రాజెక్టు లేదా ఒప్పందంలో చేరే ముందు నిబంధనలను పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు