పౌరులందరూ ఓటు నమోదు చేసుకోండి : అజయ్ సారధి రెడ్డి  

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డు , పట్టణంలో స్థానిక 33 వ వార్డు కౌన్సిలర్ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్  అజయ్ సారధి రెడ్డి  తోపుడు బండి పై సర్ ఫారాలతో ఇంటింటికి వినూత్నంగా  మైక్ ప్రచారం నిర్వహించాడు. ఈ సందర్భంగా  అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు తీసుకోవాలన్నారు. ఆగస్టు మూడున చివరి తేదీ ఉన్నందున ఓటర్లందరూ ఎక్కడ ఉన్నా వచ్చి వివిధ వార్డులలో బిఎల్ఓ బి ఎల్ ఎల దగ్గర  దగ్గర ఆయా వార్డులలో తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. సమాజంలో పాలనలో మార్పు జరగాలన్న ఓటుతోటే సాధ్యమని దేశంలో ఓటు మన హక్కుని దానిని ప్రతి ఒక్కరు బాధ్యతతో నమోదు చేసుకొని వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో ఓటు హక్కు లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని ప్రజలంతా తమ ఓట్లను నమోదు చేసుకోవాలని ఇంటింటికీ తిరిగి మైక్ తో ప్రచారం నిర్వహించి వృద్ధుల దగ్గరికి వెళ్లి స్వయంగా ఫామ్ నింపి ఓటర్లను చైతన్యం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ సరస్వతి, మరియు పెరుగు కుమార్, నీలం వెంకటేశ్వర్లు యూసుఫ్, సాయి, మేక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/all-citizens-register-to-vote-ajay-saradhi-reddy/article-19202

Tags: