అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం
- ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం
విశ్వంభర, పాలకుర్తి: అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసులు మరోసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తొర్రూరు సర్కిల్ పరిధిలోని తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో పలువురు అక్రమ వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్దఎత్తున ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, అప్పులకు సంబంధించిన పత్రాలు, ఇతర కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విచారణలో అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అత్యధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, చట్టవిరుద్ధంగా అప్పులు ఇచ్చే వ్యక్తుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన రక్షణతో పాటు చట్టపరమైన సహాయం అందిస్తామని తెలిపారు.