రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందించడంలో శాఖల సమన్వయం అవసరం: డీఆర్వో నాగలక్ష్మి
విశ్వంభర, మహబూబాబాద్: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం, పరిహారం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.ఏ.వి. నాగలక్ష్మి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి హిట్ అండ్ రన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. హిట్ అండ్ రన్ పథకం కింద మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అలాగే పీఎం రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్యం లేదా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని చెప్పారు. పీఎం రాహ్‌వీర్ పథకం కింద ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారని వివరించారు. రోడ్డు ప్రమాదాల వివరాలను ఈ-డీఏఆర్ వ్యవస్థలో నమోదు చేసి సంబంధిత శాఖలు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు రాజేశ్వరి, గణేష్, డీఎంహెచ్‌వో డాక్టర్ రవి రాథోడ్, రవాణా శాఖ అధికారి బి. శంకర్, పోలీసు శాఖ ప్రతినిధులు, బీమా సంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.