ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించి ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె. అనిల్ కుమార్, పురుషోత్తం, జిల్లా రెవెన్యూ అధికారి టి.ఏ.వి. నాగలక్ష్మి, డీఆర్‌డీఓ మధుసూదనరాజుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లా కేంద్రంలో ప్రజావాణి నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, తమ పరిధిలో లేని అంశాలపై సంబంధిత శాఖలకు పంపించి దరఖాస్తుదారులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. ప్రజావాణిలో ఈసారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నాణ్యత, భూ పట్టాల సవరణ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రెవెన్యూ, సంక్షేమం, ఇతర శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై వినతులు అందాయి. డోర్నకల్ మండలం టి.బంజర గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని, తామే సొంతంగా నిర్మాణం పూర్తి చేశామని, అందుకు అయిన ఖర్చును చెల్లించాలని కోరారు. కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన రైతు సాదాబైనామా ఆన్‌లైన్ నమోదు లోపాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేయగా, కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన రైతు ప్రభుత్వ చెరువును కబ్జా చేసే ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ వారంలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 205 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులు వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం–ఎస్‌బీఐ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు అమలవుతున్న ఎస్‌జీఎస్‌పీ శాలరీ ప్యాకేజ్పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకంలో ఉద్యోగులందరూ నమోదు చేసుకోవాలని ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఎస్. ఈశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.