ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి తీవ్ర ముప్పు: ప్రొ. పురుషోత్తం రెడ్డి

విశ్వంభర, బషీర్‌బాగ్: ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హరిబౌలిలోని రిఫాయం హైస్కూల్‌లో అంతర్జాతీయ ప్లాస్టిక్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుందని, అది మైక్రో ప్లాస్టిక్‌గా మారి మానవ శరీరంలోకి చేరి పలు ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుందని తెలిపారు. పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సి. ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహారం, టీ, కాఫీ తీసుకోవడం వల్ల క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.  మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పి. సాయికుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల వెలువడే విషవాయువులు గాలి కాలుష్యానికి, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరించారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ సంస్థ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే పాతబస్తీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉత్తంకొటారిని అతిథులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/use-of-plastic-is-a-serious-threat-to-the-environment/article-19208

Tags: