మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ధర్నా
విశ్వంభర, ఖైరతాబాదు : 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా వెంటనే అమలు చేయాలని మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం హైదరాబాదు రాజ్‌భవన్ సమీపంలో ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, పీఓడబ్ల్యూ, సీఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీనియర్ నాయకురాలు టి. జ్యోతి మాట్లాడుతూ, పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. మహిళలకు చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమని అన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమైన హక్కు అని, చట్టం అమలులో జాప్యం అన్యాయమని విమర్శించారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ, మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే వారి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని పేర్కొంటూ, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఆర్. అరుణ జ్యోతి, పద్మ, ఫైమీదా బేగం, ప్రేమ్ పవాని, స్వరూప, కె.ఎన్. ఆశాలత, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, బండి పద్మ, కె. నాగలక్ష్మి, బట్టుపల్లి అనూరాధ, ఎం. వినోధ, పి. శశికళ, వై. వరలక్ష్మి, షబానా బేగం తదితరులు పాల్గొన్నారు