గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకే నీటి శుద్ధి యంత్రం

  1. నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్    

 విశ్వంభర, ఇనుగుర్తి:  స్వచ్ఛమైన మంచినీరు అందించి గిరిజనుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సంకల్పంతోనే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. ఇనుగుర్తి మండలం మీట్య తండాలో బిజెపి జిల్లా యువ నేత గుగులోతు నవీన్ నాయక్ కోరిక మేరకు హుస్సేన్ నాయక్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించారు. హుస్సేన్ నాయక్ సూచన మేరకు కెనరా బ్యాంకు వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత(సి ఎస్ ఆర్) లో భాగంగా నీటి శుద్ధీకరణ యంత్రం రూ.5లక్షలతో ఏర్పాటుచేసిన నీటి శుద్ధీకరణ యంత్రాన్ని హుస్సేన్ నాయక్ కెనరా బ్యాంక్ సీజీఎం కళ్యాణ్ ముఖర్జీ తో కలిసి సోమవారం ప్రారంభించి తండావాసులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన నీరు తాగితేనే కాలా నుగుణంగా వచ్చే వ్యాధులతో పాటు ఇతర జబ్బులు రావన్నారు.రైతులకు స్ప్రే పంపులు, బీటెక్ బాలికలకు లాప్టాప్ లు, బాల బాలికలకు సైకిల్ తన సిఫారసుతో సిఎస్ఆర్ లో భాగంగా యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంకులు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.అధికారులతో రివ్యూ లో భాగంగా తండాకు చెందిన బానోతు బాలు నాయక్ మీట్య తండాలోని గిరిజన రైతుల భూములకు బ్యాంక్ అధికారులు ఋణము ఇవ్వడం లేదని,ధాన్యాన్ని, మొక్కజొన్నలను ప్రభుత్వం కొనడం లేదని, ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మికి హుస్సేన్ నాయక్ సూచించారు. పలు సమస్యలపై పలువురు అందజేసిన వినతి పత్రాలను హుస్సేన్ నాయక్ తీసుకున్నారు.కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో పార్థసారథి,ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి,కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉష, సాంబశివరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేత వద్దిరాజు రామచంద్ర రావు, మండల అధ్యక్షులు దుంపల సందీప్, కారు పోతుల చంద్రమౌళి గౌడ్,కాలేరు నేతాజీ, పోలేపల్లి వెంకటేశ్వర్లు,వార్డు సభ్యులు బానోతు పద్మ వెంకన్న,దస్మ, వివిధ గ్రామాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-water-purifier-is-for-the-protection-of-the-health/article-19179

Tags: