విద్యతో పాటు విలువలను పెంపొందించాలి: గవర్నర్  శివ్ ప్రతాప్ శుక్లా 

విశ్వంభర, నారాయణగూడ : విద్య అంటే కేవలం జ్ఞానం కాదు.. సద్గుణాలు, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దే ప్రక్రియని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాదులోని నారాయణగూడలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడు అన్నదానం సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, గురువుల పట్ల గౌరవం పెంపొందించు కోవాలని సూచించారు. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలు ఎనిమిది దశాబ్దాలకు పైగా నాణ్యమైన విద్యతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు అండగా నిలవడం సంస్థ సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు. ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో ఉన్నత విద్య కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా కొత్త కోర్సులు, పాఠ్యాంశాల సంస్కరణలు చేపడుతు న్నామని తెలిపారు. తెలంగాణను ఉన్నత విద్యలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యా, సేవా రంగాల్లో విశిష్ట కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో: సి.ఏ. జె. నరసింహారావు, శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నీల్ గోగ్టే, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/values-should-be-inculcated-along-with-education-governor-shiv-pratap/article-19138

Tags: