మాంటిస్సోరి హైస్కూల్‌లో మాక్‌ ఎన్నికలు

మాంటిస్సోరి హైస్కూల్‌లో మాక్‌ ఎన్నికలు

విశ్వంభర, హుస్నాబాద్: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే లక్ష్యంతో హుస్నాబాద్‌లోని మాంటిస్సోరి హైస్కూల్‌లో మాక్‌ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సంఘం విధానాన్ని అనుసరిస్తూ నామినేషన్‌, ప్రచారం, రహస్య బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. విద్యార్థులే అభ్యర్థులుగా పోటీ చేసి ప్రచారం నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, బాధ్యతాయుతమైన పౌరసత్వంపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కె. రవీందర్, షాజు థామస్, ఏహెచ్‌ఎం సునీల కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mock-elections-in-montessori-high-school/article-19111

Tags: