గుండాల కేజీబీవీలో ప్రత్యేక అడ్మిషన్లు

గుండాల కేజీబీవీలో ప్రత్యేక అడ్మిషన్లు

విశ్వంభర, గుండాల: గుండాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల ప్రవేశాలకు ప్రత్యేక అవకాశం కల్పించారు. పాఠశాలలో 6వ తరగతిలో 7 సీట్లు, 7వ తరగతిలో 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రత్యేక అధికారి తెలిపారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్ల కోసం జూలై 21, 22, 23 తేదీల్లో పాఠశాల ఆవరణలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థినులు అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రత్యేక అధికారి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని అర్హులైన బాలికలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-admissions-in-gundala-kgbv/article-19206

Tags: