పాలడుగు నాగయ్య ఆశయాల పరిరక్షణ అభినందనీయం
విశ్వంభర, రవీంద్రభారతి : "పాలడుగు నాగయ్య సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించే ప్రయత్నాలు ఆదర్శప్రాయమైనవని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించిన పాలడుగు నాగయ్య జయంతి వేడుకల్లో ప్రముఖ జానపద సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డికి పాలడుగు నాగయ్య జానపద సాహిత్య పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, పాలడుగు నాగయ్య రచనలను సమగ్రంగా వెలుగులోకి తీసుకువస్తున్న ప్రయత్నాలను అభినందించారు. జానపద సాహిత్యాన్ని కొత్త తరానికి చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ జి.బి. రాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే జానపద కళారూపాల ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన వ్యక్తిగా పాలడుగు నాగయ్యను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. పురస్కార గ్రహీత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, జానపద సాహిత్య పరిరక్షణకు కృషిని కొనసాగిస్తానని తెలిపారు. సభకు రామకృష్ణ చంద్రమౌళి అధ్యక్షత వహించగా, శ్రీమతి పాలడుగు సరోజినీ దేవి నిర్వహించారు. పి. బడే సాబ్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి రమేష్, గంట మనోహర్ రెడ్డి, అర్ధ చంద్రప్రకాశ్ రెడ్డి, రాధాకృష్ణ, సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, జానపద కళాభిమానులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.