నీట్ లీకేజీపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సంఘీభావంగా సోమవారం హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ, ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు సీపీఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సోనం వాంగ్‌చుక్ దీక్ష కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఆందోళన చేస్తున్న వారితో వెంటనే చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, మల్లు లక్ష్మి, డీజే నరసింహారావు, వీరయ్య,వెంకటేష్, కోటా రమేష్, ప్రసాద్, శోభన్ నాయక్, శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.