జంతర్‌మంతర్ విద్యార్థుల ఉద్యమానికి ప్రజాసంఘాల సంఘీభావం
విశ్వంభర, ఢిల్లీ: ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, యువత న్యాయమైన పోరాటాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ సోనం వాంగ్చుక్ చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయడాన్ని ఖండిస్తూ, విద్యార్థుల సమస్యలపై ప్రధానమంత్రి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీటీఎఫ్, టీఎఫ్‌టీయూ, విద్యావంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, ప్రజా ఫ్రంట్, ఎంఆర్‌జేసీ, కాంగ్రెస్, ఎస్సీ-ఎస్టీ ఉద్యోగుల సంఘం తదితర ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.