కొత్తచెరువులో అక్రమ కట్టడాలు కూల్చివేయాలి
- ఎఫ్‌టీఎల్ హద్దులు గుర్తించి చర్యలు తీసుకోవాలి
- బికేఎస్ హుస్నాబాద్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కొత్తచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని భారతీయ కిసాన్ సంఘ్ హుస్నాబాద్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2025 డిసెంబర్ 2న ఇరిగేషన్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన సర్వే నివేదికలో కొత్తచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు స్పష్టం చేసినప్పటికీ, ఇప్పటి వరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కోట్ల రూపాయల వ్యయంతో కొత్తచెరువు అభివృద్ధి, మినీ ట్యాంక్‌బండ్, ఆరేపల్లి బైపాస్ రహదారి పనులు చేపడుతున్న నేపథ్యంలో చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను వెంటనే గుర్తించి ఆక్రమణలను తొలగించడం అత్యవసరమన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించి ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువును పరిరక్షించాలని కోరారు. లేకుంటే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.