ధర్మారెడ్డిపల్లి  కాలువ కల్వర్టుపై సైడ్ గోడలను నిర్మించాలి

 -సిపిఎం డిమాండ్

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లావలిగొండ చౌటుప్పల్ మెయిన్ రోడ్డు కు కింది నుండి వెళ్తున్న జాలు కాలువ పరిధిలోని ప్రమాదకరంగా ఉన్న ధర్మారెడ్డిపల్లి  కాలువ కల్వర్టుపై సైడ్ గోడలను నిర్మించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని జాలు కాలువ గ్రామ శివారులో గోకారం నుండి వెల్లంకి వెళ్లే ధర్మారెడ్డిపళ్లి కాలువ ప్రమాదకర కల్వర్టు ను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మారెడ్డి పళ్లి కాలువ కాంట్రాక్టర్ కాల్వకు మరమ్మత్తులు చేసే భాగంగా కల్వర్టుకు ఇరువైపులా గోడలను నిర్మించకుండా పోసిన మట్టి మొత్తం కాల్వలోకి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయని దీనితో మూలమలుపు కావడం వల్ల అనేక మంది ప్రయాణికులు రాత్రి సమయాల్లో దానిలో పడిపోయిన పరిస్థితులు ఉన్నాయని ఎలాంటి ప్రాణహాని జరగకముందే కాంట్రాక్టర్ ఇప్పటికైనా స్పందించి ప్రమాదకరంగా ఉన్న కల్వర్టుకు ఇరువైపులా సైడ్ గోడలను నిర్మించాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా కాల్వ మరమ్మత్తు పనుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ రకంగా నాసిరకమైన పనులు జరుగుతున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ గుంతలు నిత్యం చౌటుప్పల్ వలిగొండ కు ప్రయాణం చేస్తున్న అనేకమంది ప్రయాణికులకు శాపంగా మారాయని వీటిలో పడితే మనుషుల ప్రాణాలు పోతాయని మనుషుల ప్రాణాలు పోతే మాత్రమే అధికారులు స్పందిస్తారా? అని వారు ప్రశ్నించారు వెంటనే అధికారులు ఇట్టి స్థలాన్ని పరిశీలించి గోడలను నిర్మాణం చేయించాలని లేనిపక్షంలో ఆ స్థలం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోకారం మాజీ సర్పంచ్ సిర్పంగి శ్రీరాములు,మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్,నాయకులు మద్దెల మారయ్య, రాపోతు వెంకులు, ఇంద్రారెడ్డి,చేగూరి నగేష్, గంగాపురం వెంకటేశం, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/side-walls-should-be-constructed-on-dharmareddypalli-canal-culvert/article-19192

Tags: