ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీ కి దరఖాస్తుల ఆహ్వానం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం ఆయా సబ్జెక్టులలో నెట్, సెట్, ఎం.ఫిల్, పిహెచ్.డి.లలో ఏదేని ఒక అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. డైరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్ పోస్టులకు గాను ఈనెల 23వ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులను ఇవ్వవలసిందని తెలియజేశారు. అదే విధంగా మరుసటి రోజు అనగా 24వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, కావున అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని సకాలంలో హాజరు కావలసిందని కోరారు

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/applications-are-invited-for-filling-up-the-posts-of-guest/article-19124

Tags: