కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : రాజకీయాలను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి కరవు ముప్పు నుంచి రైతులను, ప్రజలను కాపాడాలని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన అనుమతులు తీసుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. రిటైర్డ్ ఇంజనీర్ల పరిశీలనలో ప్రస్తుతం నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ, కాళేశ్వరం అంశాన్ని రాజకీయ వివాదంగా కాకుండా రైతుల ప్రయోజనాల కోణంలో పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసి సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో: నంద్యాల నరసింహారెడ్డి, భూపాల్, వెంకట్ రాములు, అరిబండి ప్రసాద్ రావు, పి. జంగారెడ్డి, శోభన్, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, దుబ్బాక రామ్‌చందర్, బి. రాము, వి. నాగిరెడ్డి, విజయ్, ప్రసాద్, బొప్పని పద్మ, ధర్మా నాయక్, శ్సరళ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/steps-should-be-taken-immediately-to-lift-the-water-of/article-19115

Tags: