ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
: గొల్లపల్లి నాగరాజు
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుడు గొల్లపల్లి నాగరాజు అన్నారు. హైదరాబాదులో సోమవారం జరిగిన ఉద్యమకారుల కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ లతో జరిగిన సమాలోచన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, సంక్షేమం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు.