ప్రిన్సిపాల్ ను  వెంటనే బదిలీ చేయాలి

ప్రిన్సిపాల్ ను  వెంటనే బదిలీ చేయాలి

 : తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  రవికుమార్

విశ్వంభర, బషీర్ బాగ్ :  జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్  దిలీప్ కుమార్ ను వెంటనే అక్కడి నుండి బదిలీ చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపాల్ ను మార్చాలని గతంలో రెండు సార్లు జనగామ జిల్లా కలెక్టర్ కు విన్నపించినా  ఫలితం లేదన్నారు. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నది అనడానికి ఇది నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో డిప్టేషన్ పై రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ గా వచ్చిన దిలీప్ కుమార్ ను ఇంతవరకు అక్కడనే ఉంచడం ఆశ్చర్యం కలగజేస్తుందన్నారు. 2022లో డిప్టేషన్ పై వచ్చిన ప్రిన్సిపల్ నాలుగు సంవత్సరాలు గడుస్తున్న బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలోలో ఉన్న అతనిని ఇంతవరకు ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. బాలికల రెసిడెన్స్ లో ఉండవలసిన  మహిళ.. ప్రిన్సిపల్ కు బదులు మేల్  ప్రిన్సిపల్ ఉండడం వలన వారి సమస్యను వారి బాధలను వారి ఇబ్బందులను చెప్పుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల రెసిడెంట్ స్కూల్ అండ్ జూనియర్ లో ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-principal-should-be-transferred-immediately/article-19212

Tags: