ఢిల్లీ పోలీసుల దమనకాండను ఖండించిన ఏఐవైఎఫ్

విశ్వంభర, హుస్నాబాద్: న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద "ఛలో పార్లమెంట్" కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జీ, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐవైఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్ తెలిపారు. ఎన్‌టీఏలో అవినీతి, పరీక్షల నిర్వహణలో లోపాలపై విద్యార్థులు న్యాయమైన డిమాండ్లతో నిరసన వ్యక్తం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం పోలీసు బలంతో అణచివేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని విమర్శించారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేసి, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని, లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aif-condemns-delhi-police-damanakanda/article-19122

Tags: