సూర్యాపేటలో బూత్ లెవెల్ అధికారులను సన్మానించిన రెవెన్యూ అధికారులు
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 7, 23 వ వార్డుల్లో ఎన్యుమరేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన బూత్ లెవెల్ అధికారులు ప్రశంసలు అందుకున్నారు. 82, 78 పోలింగ్ బూత్‌ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలు తంతేన పల్లి సుజాత, గట్టు రమ్యకృష్ణలు నిర్దేశిత గడువులోగా సర్వే పనులను పకడ్బందీగా ముగించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన అధికారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఎంఆర్వో సాయి గౌడ్, డిప్యూటీ తహశీల్దార్ లాలూ, ఎలక్షన్ డిటి లావణ్య, బీఎల్వోలతో పాటు ఎలక్షన్స్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లును శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోల శ్రమ అభినందనీయమని, ఇదే స్పూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో బిఎల్ఏ లు మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నారు.