బెల్ట్ షాపుల్లో పెంచిన మద్యం ధరలు తగ్గించాలి: వైసీపీ భారీ ర్యాలీ

విశ్వంభర,  బ్రహ్మసముద్రం: బెల్ట్ షాపుల్లో అక్రమంగా పెంచిన మద్యం ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ, పీఏసీ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, బెల్ట్ షాపుల్లో మద్యం బాటిళ్లపై అదనంగా వసూలు చేస్తున్న ధరలను తగ్గించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బెల్ట్ షాపుల్లో ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల పంట బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించాలని, ఎరువుల ధరలను తగ్గించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ కంభం చంద్రశేఖర్ రెడ్డి, వైస్ కన్వీనర్ కొండాపురం రాము, మండల బూత్ కన్వీనర్ హనుమంత్ రెడ్డి, యూత్ కన్వీనర్, మాజీ ఎంపీపీ బీఎల్‌ఏ మహదేవప్ప, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ycp-has-a-huge-rally-to-reduce-the-increased-prices/article-19214

Tags: