రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రామన్నపేట విద్యార్థులకు పతకాలు
విశ్వంభర, రామన్నపేట: ఈనెల 18 న మెదక్ జిల్లా ఇందిరా ప్రియదర్శిని అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తోటకూరి శివాని బి.ఏ. ప్రథమ సంవత్సరం అండర్ 18 బాలికల 1500 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, జి.సునీల్ బి.ఏ. ద్వితీయ సంవత్సరం పురుషుల 1500 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారని కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. శివాని, సునీల్ లు గత కొంత కాలం నుండి భువనగిరిలోని హనుమాన్ ట్రైనింగ్ సెంటర్లో, అథ్లెటిక్స్ కోచ్ కోనేటి గోపాల్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారని తెలియజేస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ ఎం.రవీందర్ రావుతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.