కార్మికుల అండతో మళ్లీ కేసీఆర్ పాలన: వినోద్ కుమార్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: కార్మికులు, పేదల సంక్షేమాన్ని కాపాడిన కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని,  కార్మికుల హక్కుల పరిరక్షణే భారత రాష్ట్ర సమితి సిద్ధాంతమని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించామని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ నాయకుల విలీన సభలో తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్‌కు చెందిన దేవానంద్, రామన్న, ఎయిర్‌టెల్ రాజు, హరి, పరమేశ్వర్, హరిబాబు, లక్ష్మణ్, శోభా తదితరులు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్‌టీయూ)లో చేరారు. వారికి వి. శ్రీనివాస్ గౌడ్, బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్‌టీయూ కండువాలు కప్పి ఆహ్వానించారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, పేదలు సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌టీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర సాధనతో ముగియలేదని, పేదలు, కార్మికులు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మైనారిటీ విద్యాసంస్థలను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ, ప్రజల మద్దతుతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మారన్న, నారాయణ, రాజు యాదవ్, ఆంజనేయులు, రామకృష్ణ, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/vinod-kumars-rule-of-kcr-again-with-the-support-of/article-19174

Tags: