మృతుడి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం
విశ్వంభర, పాలకుర్తి : సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా (కే) గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లావుడ్యా రాంచంద్రు చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ తరఫున రూ.3 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా, ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొంది అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న లావుడ్యా రాందాన్, లావుడ్యా సువాలిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, స్థానిక సర్పంచ్ లావుడ్యా శిల్ప నరేష్, సర్పంచ్ ఇస్లావత్ సంతోష్, నాయకులు లావుడ్యా వాసు, యాకు, లకపతి, రణ్య, చందు లక్ష్మన్, ఐత జంపి, సురేందర్, వాగ్యతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.