విద్య వైద్యానికే మొదటి ప్రాముఖ్యత ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు

WhatsApp Image 2024-07-17 at 17.56.04_8a8bf0e6 - Copy

విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 17:- రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు, కార్యక్రమంలో భాగంగా భవనాన్ని ప్రారంభించి అనంతరం మండలంలోని జమ్ముల తండాలో 26 మంది రైతులకు వ్యవసాయ పంపు సెట్లను పంపిణీ చేశారు,

Read More  ఎల్బీనగర్ చౌరస్తా లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం 

WhatsApp Image 2024-07-17 at 17.56.04_8a8bf0e6 - Copy

ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, 35 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డీవో సూరజ్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, బాలాజీ సింగ్, శ్రీనివాస్ గౌడ్,యాట నరసింహ, గూడూరు  రెడ్డి, బిచ్చ నాయక్, తదితర ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు