అయ్యప్ప మందిరానికి లక్ష రూపాయల విరాళం
On
విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప మందిర ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మహిళ దినోత్సవ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు (చిరంజీవి) పాల్గొనడం జరిగింది. ఆలయ అభివృద్ధి కొరకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మందిరానికి ఎటువంటి మద్దతు కావాలన్న ముందుంటనని ఆలయ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. దైవ సేవ చేయడంలో మనసుకు ప్రశాంతత లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోనే శంకర్, ఉపాధ్యక్షులు సుధాకర్, ట్రెజరర్ రాచన్న ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



