మానసిక శారీరక వికలాంగులైన బాలల వికాసానికి కృషి చేయడం అభినందనీయం..

మానసిక శారీరక వికలాంగులైన బాలల వికాసానికి కృషి చేయడం అభినందనీయం..

విశ్వంభర, బషీర్ బాగ్: మాన్య స్పోర్ట్స్, కల్చరల్ అకాడమీ (ఏ డివిజన్ ఆఫ్ వికాస భారతి చారిటబుల్ ట్రస్ట్) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని కేబిఆర్ పార్క్ లో గల వినాయకుని వద్ద పూజలు నిర్వహించామని అని వికాస భారతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రామగోపాల్ రెడ్డి,  ప్రమోద్ సాన లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బీరంగుల ఉదయ్  కిరణ్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాజీ మంత్రి ఎం.వి మైసూరా రెడ్డి, పారిశ్రామికవేత్తలు రాజేంద్ర అగర్వాల్ సురేందర్ అగర్వాల్, స్కేటింగ్ దినేష్ పంచల్ ఫుట్బాల్ కోచ్ మల్లికార్జున్ గౌడ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ కుమార్ విచ్చేశారు. మానసిక శారీరక వికలాంగులైన బాలల వికాసానికి కృషి చేస్తున్నట్టు వికాస భారతి చారిటబుల్ ట్రస్ట్ ముందు ముందు వేసవి శిబిరాల ద్వార హైదరాబాదులోనే కాకుండా ఇతర జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. తన సొంత మహబూబ్నగర్ జిల్లాలో స్వామి వివేకనంద విగ్రహాలు,  దేవాలయాలు రెడ్ క్రాస్ సొసైటీ కి మరియు శంకర్ నేత్రాలయాలకు ఎన్నో నిధులు సమకూరుస్తున్నారు.  వికాస భారతి చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న కార్యక్రమాలకు తన సహాయాన్ని అందిస్తానని చెప్పారు. నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం ఆత్మ చరణ్ రెడ్డి  సైతం వికాస పార్టీ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. మాన్య కల్చరల్, స్పోర్ట్స్ అకాడమీ చేపట్టే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

Tags: