ఘనంగా సీతారాముల కళ్యాణం

ఘనంగా సీతారాముల కళ్యాణం

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : శ్రీరామ నవమి సందర్భంగా నగరంలోని దేవాలయాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ కళాశాల ఎదురుగా ఉన్న హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయాన్ని సుందరంగా అలంకరించి, ప్రత్యేక వేదికలతో కళ్యాణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై సీతారాముల కల్యాణ ఘట్టాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, చిక్కడపల్లి ఎస్‌హెచ్‌ఓ మల్లేశం, వెంకటకృష్ణ, దామోదర్ రెడ్డి, సంతోష్ గౌడ్, మనోహర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రమేష్ రెడ్డి, జయరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: