ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి..

పోమాల్ పల్లి గ్రామంలో పర్యవేక్షించిన ఎంపీడీఓ,ఏపీఓ..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి..

విశ్వంభర, కేశంపేట : ఇండ్లు లేని పేదవారికి ఇండ్లను నిర్మించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. పైలైట్ ప్రాజెక్ట్ కింద పోమాల్ పల్లి గ్రామాన్ని ఎంపిక చేయగా ఇందులో భాగంగా సోమవారం మండల అభివృద్ధి శాఖ అధికారి రవిచంద్ర కుమార్ రెడ్డి, మాజి సర్పంచ్ నిదురం కృష్ణయ్య, మాజి ఉప సర్పంచ్, ప్రస్తుత కేశంపేట మండల కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షులు అనుమ గళ్ళ రమేష్,గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనుంజయ్ లతో కలిసి గ్రామంలో లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు సంబందించి అధికారులు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ లబ్ధిదారులు పనులను వేగవంతం చేయాలని పలు సూచనలు చేశారు. ఎంపీడీఓ వెంట గ్రామ కార్యదర్శి తో పాటు మాజి వార్డు సభ్యులు బి.పర్వతాలు కే.శ్రీనివాసులు మహిళా సంఘాల వివో ఎన్.మంగ,లబ్ధిదారులు ఉన్నారు.

Tags: