V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

జాతీయ పతాక ఆవిష్కరించిన విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా కాచం సత్యనారాయణ 

 V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ :  చైతన్యపురి V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి లయన్ డా.  కాచం సత్యనారాయణ  జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు  స్వాతంత్య్ర  సమారయోధుల త్యాగాలను గుర్తు చేసుకొని వారి చేసిన  కృషిని కొనియాడారు. వారి పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్  కాసం సాయి, సీనియర్ కరెస్పాండెంట్స్ దుమ్మాజి నవీన్ కుమార్ , ఏలే మహేష్ నేత , విశ్వంభర దినపత్రిక బ్యూరో చీఫ్ పోతుగంటి వెంకట రమణ , న్యూస్ ప్రేసెంటెర్ ఎమిలియా  సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ మేడికొండ పరమేష్ , మార్కెటింగ్ మేనేజర్ రాజు , సీనియర్ వీడియో జర్నలిస్ట్స్ గజవెళ్లి గురుమూర్తి , ఎలగందుల అఖిల్ , వీడియో ఎడిటర్ సాయి తదితరులు పాల్గొన్నారు. 

 

Tags: