ఘనంగా రాములోరి కల్యాణం మహోత్సవాలు. - పాల్గొన్న బొమ్మర్ల సతీష్, కల్లేపల్లి రాజు నేత
On
విశ్వంభర, హైదరాబాద్ :- గ్రేటర్ హైదరాబాదులోని వివిధ డివిజన్లో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవములను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు బొమ్మర్ల సతీష్ , ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత లు సందర్శించి సీతారాముల స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. పలు కల్యాణ వేదికలను సందర్శించి స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించి , ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆయా శ్రీరామనవమి కమిటీ లు వారిని ఘనంగా సన్మానించారు. ఆలయ చైర్మన్ లకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా పండుగలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.



