నేను రాజీనామాకు సిద్దం.. భూ వివాదం మల్లారెడ్డి సవాల్

నేను రాజీనామాకు సిద్దం.. భూ వివాదం మల్లారెడ్డి సవాల్

సుచిత్రలోని భూవివాదంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ భూమి విషయంలో తన దగ్గరు ఉన్నవి తప్పుడు డాక్యుమెంట్స్ అని తేలితే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ కాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ రాజీనామాకు సిద్దమా? అని సవాల్ విసిరారు. ఈ భూమిలో సర్వే ఇప్పుడే పూర్తి అయిందని కొన్ని రోజులు ఆగితే ఎవరివి ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలిపోతుందని చెప్పారు. తన దగ్గరున్న ఒరిజినల్స్ డాక్యుమెంట్స్‌తో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి, కలెక్టర్లను కలుస్తానని చెప్పారు.  

 

Read More మంత్రి ఉత్తమ్ తండ్రికి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు 

నిన్న జరిగిన ఈ భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఆయన కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యంగా భూమిని అక్రమించారని ఆరోపించారు. తాము కొన్న భూమిని ఫేక్ డాక్యుమెంట్లు అని మల్లారెడ్డి చెప్తున్నారని అన్నారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌ను వెకేట్ చేయించుకోలేదన్నారు. గతంలో తాము పోలీసులకు, మున్సిపల్ కమీషనర్‌కు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని లక్ష్మణ్ ఆరోపించారు. దీంతో లక్ష్మణ్ కు మల్లారెడ్డి సవాల్ చేశారు. 

 

Read More మంత్రి ఉత్తమ్ తండ్రికి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు 

ప్రస్తుతం తెలంగాణలో మల్లారెడ్డి భూ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. సుచిత్రలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రెండు వర్గాల సమక్షంలో పూర్తిగా హద్దులను సర్వే చేశారు అధికారులు. సర్వే నెంబర్ 82, 83ను సర్వే విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సర్వే రిపోర్ట్‌ను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.