వరంగల్ లో హెచ్ఐవి అవగాహన ర్యాలీ

వరంగల్ లో హెచ్ఐవి అవగాహన ర్యాలీ

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి ఎంజీఎం చౌరస్తా వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హెచ్ఐవి అవగాహన ర్యాలీని  కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా  వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వరంగల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సెంటర్ జైల్ వరంగల్ సబ్ జైల్ నర్సంపేట లలో హెల్త్ మెగా క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి సాంబశివరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి మీడియాతో మాట్లాదారు.  జైల్లో ఖైదీలు సిబ్బంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చికిత్సలు స్పెషలిస్ట్ వైద్యులచే పరీక్షలు చేయించినట్లు చెప్పారు. సాధారణంగా  సంక్రమిత వ్యాధులు అసంక్రమిత వ్యాధులు వ్యాప్తి చెంది అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, పౌష్టిక ఆహారము, జీవన శైలిలో మార్పులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సెంటర్ జైల్ వరంగల్ సబ్ జైల్ నర్సంపేట సూపరింటెండెంట్, స్పెషలిస్ట్ వైద్యులు, జైలులోని ఖైదీలు ,జైలు సిబ్బంది ,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .

Tags: