ఘనంగా పశు వికాస్ దినోత్సవం
విశ్వంభర, హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ ఎన్.బి.ఎఫ్.సిలలో ఒకటైన ఎస్ఎంఎఫ్ జి ఇండియా క్రెడిట్, దాని ప్రధాన పశువుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం అయిన పశు వికాస్ దినోత్సవం(పీవీడి) 8వ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్.ఎం.ఎఫ్.జి ఇండియా క్రెడిట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రవి నారాయణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పశు వికాస్ దినోత్సవం 47 ప్రదేశాలలో నిర్వహించామని తెలిపారు. మొత్తం 8,350 కి పైగా పశువులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను ఉచితంగా అందించిన ఈ కార్యక్రమంతో 2,300కి పైగా గృహాలకు ప్రయోజనం చేకూర్చిందన్నారు. 'సర్వోత్తమ సేవ, పశు, పరివార్ ఔర్ ప్రగతి' అనే ఇతివృత్తంతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, పశువుల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, స్థిరమైన పురోగతిని బలోపేతం చేయడం ద్వారా సమగ్ర గ్రామీణ అభివృద్ధికి సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించిందని తెలిపారు. 2014లో ప్రారంభించి 1.55 లక్షలకు పైగా గ్రామీణ జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని చెప్పారు. వీటిలో సుమారు 1.4 లక్షల పశువులకు ఉచిత చికిత్స, 14 వేల మందికి పైగా వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ సహాయం అందించినట్లు చెప్పారు.



