చండూరులో చేనేతల మహా ర్యాలీ - ప్రింటెడ్ చీరెలను దహనం చేసిన కార్మికులు.... 

చౌరస్తాలో రాస్తారోకోతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు   

చండూరు, విశ్వంభర:-సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ చండూరులో చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, పద్మశాలీలు  ఆదివారం చేనేత మహా ర్యాలీని చేపట్టారు.చేనేత కార్మికులు మార్కండేయ దేవాలయానికి చేరుకొని అక్కడి నుండి  ప్లకార్డులు, ఫ్లెక్సీ  ప్రదర్శిస్తూ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ చౌరస్తాకు చేరుకున్నారు. రోడ్డుపై బైటయించి రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వాటిని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ. 11 నెలలుగా త్రిఫ్ట్ పండ్ నిధులు రావడం లేదని, 8 నెలలుగా ఆగి చేనేత మిత్ర నిధులను వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. నిలువ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు ప్రభుత్వం చేనేత  చీరెలను పంపిణీ చేయాలని  కోరారు. రైతు రుణమాఫీ మాదిరిగానే చేనేత రుణమాఫీని చేపట్టాలని  ప్రభుత్వ పూచికత్తు పైన కార్మికులకు రూ. 2లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రింటెడ్ చీరలను వెంటనే ప్రభుత్వ అరికట్టాలని డిమాండ్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా చేనేత బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగానికి రూ.5000 కోట్లు కేటాయించాలన్నారు.  తమ పోరాటం దీంతో ఆగదని ప్రభుత్వం స్పందించకుంటే  మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు దాసు శ్రీనివాసులు, మాస్టర్ వీవర్ల  సంఘం అధ్యక్షుడు  జూలూరు ఆంజనేయులు, చేనేత పరిరక్షణ సేవాసమితి అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, డిసిసిబి డైరెక్టర్ జూలూరు శ్రీనివాస్ లు , కౌన్సిలర్ రాధిక శ్రీనివాసులు, జాతీయ అవార్డు గ్రహీత  గంజి యాదగిరి, కందగట్ల భావన ఋషి,  ఉభయ దేవాలయాల కమిటీ చైర్మన్ రావిరాల  నగేష్, కర్నాటి శ్రీనివాసులు, పులిపాటి ప్రసన్న,  రావిరాల శ్రీను, చెరిపల్లి కృష్ణ, చెరుపల్లి అంజయ్య, చిట్టిప్రోలు వెంకటేశం, దుస్స గణేష్  తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/handicrafts-maha-rally-in-chandur-workers-burnt-printed-sarees%C2%A0/article-3441

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.