ఘనంగా జాతీయ పతాకావిష్కరణ
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన - రాపోలు
విశ్వంభర, హైదరాబాద్ :- 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు రాపోలు వీరమోహన్ చేతులమీదుగా తుర్కయంజాల్ లోని రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ ఘనంగా చేపట్టారు. ఈ సందర్బంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తుచేస్తూ, ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, గణతంత్రాన్ని తీర్చిదిద్దిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ సేవకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జెల్ల రఘు , రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సామల స్వప్న , ఉపాధ్యక్షులు జెల్ల పర్వతాలు , గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేత, ఉపాధ్యక్షులు పెండెం నరేందర్ , కార్యాలయ కార్యదర్శి సామల మనోహర్ , కర్నాటి అశోక్ , రాపోలు పుండరీకం , రాపోలు జితేందర్ తదితరులు పాల్గొన్నారు.



