రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ 

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ 

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీకి ప్రణాళికలు సిద్దం చేసుకుంది. 2025 జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే దానికి సన్న బియ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్‌మెంటుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యాన్నే వాడుతున్నారు. సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ సెంటర్లకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. కానీ.. రేషన్ షాపుల్లో మాత్రం దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోంది. 

 

Read More చండూరు ప్రజా పాలన వార్డు సభలో రసాభాస  - ఇదేమి ప్రభుత్వం... ఇదేక్కడి న్యాయం.. 

కాబట్టి రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యాన్నే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో 90.23 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వారి కోసం ప్రతి నెలా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. దీని బట్టి చూస్తే ప్రతీ ఏడాది 21 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్టు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే 2025 నాటికి సన్నబియ్యం నిల్వలు పెంచోచ్చు అనేది సర్కార్ ఆలోచన. 

 

Read More చండూరు ప్రజా పాలన వార్డు సభలో రసాభాస  - ఇదేమి ప్రభుత్వం... ఇదేక్కడి న్యాయం.. 

అందుకే ఇప్పటి నుంచే సన్న బియ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్‌మెంటుపై దృష్టి పెట్టింది. ఈ సీజన్ నుంచే సన్న బియ్యం సాగుకు రైతులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మందికి లబ్ధి జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సన్న బియ్యం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రేవంత్ సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టుబోతోంది.