డా. సొంటి వెంకటేశ్వర్లు కు ఎక్సలెన్స్ అవార్డు 

డా. సొంటి వెంకటేశ్వర్లు కు ఎక్సలెన్స్ అవార్డు 

విశ్వంభర, బషీర్ బాగ్: హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యవసాయ సైంటిస్ట్, సన్ క్రాఫ్స్ సంస్థ వ్యవస్థాపకుడు  డా. సొంటి ఎస్.వెంకటేశ్వర్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 5వ ఎడిషన్లో 'టైమ్ టు లిప్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు' అందుకున్నారు. ఈ అవార్డును ఢిల్లీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కేంద్ర మంత్రి జితన్ రాం మాంజీ ఆధ్యర్యంలో ఏంఎస్ఏంఈ డైరెక్టర్ శోభ ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైంటిస్ట్ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు 'కర్షక సేవా రత్న' అవార్డుతోపాటు మరో 15కు పైగా అవార్డులు లభించాయన్నారు. తాను పంటలపై వచ్చే సమస్యలు - పరిష్కారాలు అనే అంశంపై తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో వేలాది పుస్తకాలను ముద్రించి రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అపూర్వ అధ్యక్షుడు డా. ఈ.ఎస్. సూర్యనారాయణతోపాటు పలువురు ప్రముఖులు ఆయన్ని సత్కరించి అభినందనలు తెలిపారు

Tags: