కీసరలో వీహెచ్ పి క్యాలెండర్ ఆవిష్కరణ
విశ్వంభర, మేడ్చల్: మల్కాజ్ గిరి జిల్లా విశ్వ హిందూ పరిషత్ ( వి హెచ్ పి) ఆధ్వర్యంలో శనివారం ఉదయం కీసర గుట్ట పుణ్యక్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో వి హెచ్ పి ఉగాది క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రజినీకాంత్ మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది మనకు తొలి మాసం, అందుకే ఉగాది పండుగ పురస్కరించుకుని ఈ తెలుగు క్యాలెండర్‌ను విడుదల చేయడం జరిగిందని అన్నారు. మన ఆచార, సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి హిందువు యొక్క ముఖ్య కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామ నర్సింహులు, ఉపాధ్యక్షురాలు కమల్ పంత్, జిల్లా కార్యదర్శి రజినీకాంత్, సహ కార్యదర్శి గోపాల్ చారి, జిల్లా బజరంగ్ దళ్ సహ సంయోజక్ రేవంత్, జిల్లా దుర్గా వాహిని సంయోజిక కుమారి జీవిక, విమర్శ ప్రముఖ్ రాజి రెడ్డి, కీసర ప్రఖండ కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి, సత్సంగ ప్రముఖ్ గగన్ తదితరులు పాల్గొన్నారు.



