కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

విశ్వంభర, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tpcc-president-mahesh-kumar-goud-visited-anjaneya-swami-in-kondagattu/article-17888

Tags: