పాత నగరం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్ ల పంపిణీ కార్యక్రమం 

పాత నగరం  మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్ ల పంపిణీ కార్యక్రమం 

విశ్వంభర,లాల్ దర్వాజా : పాత నగరం మున్నూరు కాపు సంఘo( రిజిస్ట్రేషన్ నెంబర్ 8759/2000 బచ్చన్న దేవాలయం ఎదురుగా లాల్ దర్వాజా,) ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు, అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ, మెరిట్ విద్యార్థినీ విద్యార్థినీలకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రెసిడెంట్ పల్లె శ్రవణ్ కుమార్ తెలిపారు.  ఈసారి 150 మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పదిమంది విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ అవార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా  డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి ఆకుల సుజాత,EX ట్రస్టీ మున్నూరు కాపు భవన్ కాచిగూడ,దడువాయి రాఘవేందర్, ప్రెసిడెంట్ పల్లె శ్రవణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగల భాస్కర్రావ్, ఆకుల శ్రీరాములు, తిరుపతి శివకుమార్, తిరుపతి పరమేశ్వరి మహిళా కన్వీనర్, కార్యవర్గ సభ్యులు,మరియు మున్నూరు కాపు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: