మహిళా కార్మికులకు ఉచిత బస్సు సేవలు
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే మహిళా కార్మికుల రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం సరికొత్త ముందడుగు వేసింది. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ న్యూల్యాండ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "షీ-షట్లర్" ఉచిత బస్సు సేవలను శనివారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ జెండా ఊపి బస్సును వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడల్లో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రత కోసం ఎస్‌ఎస్‌ఎస్‌సి కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలు,పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఇస్నాపూర్ నుంచి ఇంద్రకరణ్ మార్గంలో ఈ బస్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ బస్సుకు జిపిఎస్ సౌకర్యం కల్పించామని, తద్వారా బస్సు ఎక్కడ ఉందో, ఏ సమయానికి వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.మహిళలు తమ ప్రయాణ వివరాలను నిరంతరం పర్యవేక్షించుకోవడానికి (టి-సేఫ్)యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రయాణ సమయంలో ఏవైనా ఆపదలు ఎదురైతే తక్షణమే డైల్ 100కు సమాచారం అందించాలని కోరారు. పోలీసు శాఖ, పారిశ్రామిక కంపెనీల అనుసంధానంతో నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎస్‌సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, న్యూల్యాండ్ కంపెనీ సెక్రటరీ శారద, హెచ్.ఆర్ విభాగం నుంచి డి.వి.రెడ్డి, సూర్య భగవాన్, ప్లాంట్ హెడ్ మహేష్ జోషి, యాదగిరి, నవీన్, రఘునాథ్ తదితరులు



